Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ.. తారక్ అభిమాని ఆత్మహత్యాయత్నం!

Junior NTR fan suicide attempt after quarreling with Charan fans
  • కోదాడలో తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ
  • తారక్ ఫ్లెక్సీ కడుతుండగా అడ్డుకున్న చరణ్ అభిమానులు
  • ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న విడుదలవుతోంది. ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత సందడిగా ఉంది. అభిమానుల్లో అంతులేని కోలాహలం నెలకొంది. థియేటర్ల వద్ద అప్పుడే పెద్ద సందడి నెలకొంది. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంలో తారక్, చరణ్ అభిమానులు తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

తారక్ ఫ్లెక్సీ కడుతుండగా చరణ్ అభిమానులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైందని చెపుతున్నారు. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పక్కన ఉన్నవారు వెంటనే అలర్ట్ అయి అతన్ని అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు హీరోలకు చెందిన కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Junior NTR
Ramcharan
RRR
Fans
Fight
Kodad

More Telugu News