పవన్ వచ్చి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదు.. కార్యాలయం వద్ద జనసేన వీర మహిళ నిరసన
- సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని బన్సీ వాసు మోసం చేశారు
- పవన్ తరపున గాజువాక, భీమవరంలో ప్రచారం చేయమన్నారు
- డ్రగ్స్ ఎక్కించి దాడి చేశారు
సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకుంటున్న తనకు గీతా ఆర్ట్స్ సంస్థలో బన్నీ వాసు పరిచయమయ్యారని అన్నారు. గాజువాక, భీమవరంలో పవన్ కల్యాణ్ తరపున ప్రచారం చేస్తే గీతా ఆర్ట్స్ సినిమాలో చాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తనకు డ్రగ్స్ ఎక్కించి దాడికి కూడా పాల్పడ్డారని అన్నారు. పవన్ వచ్చి తనకు న్యాయం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని సునీత తేల్చి చెప్పారు.