Vijay Devarakonda: త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda in Trivikram movie
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండకి వెంటవెంటనే రెండు ఫ్లాపులు పడ్డాయి. దాంతో గ్యాప్ లేకుండా 'లైగర్'తో ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండానే ఆ సినిమా షూటింగు ఆలస్యమవుతూ వచ్చింది .. అందుకు కరోనా కూడా ఒక కారణమైంది. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సుకుమార్ తోను .. శివ నిర్వాణతోను విజయ్ దేవరకొండ సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. 'పుష్ప 2'తో సుకుమార్ బిజీ కానున్నాడు కనుక, శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. 

విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్న దర్శకులు ఆయనను కలిస్తే, 'త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తరువాత చూద్దాం' అంటున్నాడట. మహేశ్ బాబుతో సినిమా తరువాత త్రివిక్రమ్ చేసే సినిమా విజయ్ దేవరకొండతోనే అనుకోవలసి వస్తోంది. ఈ లోగా శివ నిర్వాణ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచన ఆయనకి ఉందా? లేదా? అనేదే డౌటు!
Go Back to Shorts
Vijay Devarakonda
Puri Jagannadh
Trivikram Movie

More Telugu News