Telugudesam: బస్సులో జంగారెడ్డిగూడెంకు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs going to Jangareddygudem
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు  పట్టుపట్టారు. అయితే, ఈ మరణాలు సాధారణ మరణాలేనని ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు జంగారెడ్డిగూడెంకు బయల్దేరారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో బయల్దేరారు. తమ పర్యటన సందర్భంగా కల్తీ సారా మృతుల కుటుంబాలను టీడీపీ ఎమ్మెల్యేలు పరామర్శించనున్నారు. అంతేకాదు మొత్తం 27 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ. 27 లక్షల పరిహారం ఇవ్వనున్నారు.
Go Back to Shorts
Telugudesam
MLAs
Jangareddygudem

More Telugu News