RRR: నేడు చిక్క బళ్లాపూర్ లో 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్... చాలా రోజుల తర్వాత అందరినీ కలవబోతున్నామన్న రాజమౌళి

RRR pre release event in Karnataka
షార్ట్స్‌లో చూడండి
విడుదల తేదీ (మార్చి 25) దగ్గరపడుతున్న కొద్దీ ఆర్ఆర్ఆర్ ప్రచారం ఉద్ధృతమవుతోంది. ఇవాళ చిత్రబృందం కర్ణాటకలోని చిక్క బళ్లాపూర్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నద్ధమవుతోంది. దీనిపై ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ఓ వీడియో సందేశం వెలువరించారు. ఎగ్జయిట్ మెంట్ ఆపుకోలేకపోతున్నామని తెలిపారు. ఇవాళ రాత్రి బిగ్ ఈవెంట్ జరగనుందని, ఎన్నో సంవత్సరాల తర్వాత అందరినీ కలవబోతున్నామని తెలిపారు. కర్ణాటక సీఎం కూడా ఈ కార్యక్రమానికి వస్తుండడంతో ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నామని అన్నారు. 

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 18 నుంచి చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నెల 22 వరకు వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. నిన్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దుబాయ్ లోనూ సందడి చేశారు.
Go Back to Shorts
RRR
Pre Release Event
Rajamouli
Bengaluru
Karnataka

More Telugu News