Nara Lokesh: క‌ల్తీ సారా వ‌ల్ల వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు: నారా లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు తెలిపిన నిర‌స‌న‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
          
'కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 28 ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా, జే బ్రాండ్స్ లిక్కర్ పై అసెంబ్లీ లో చర్చ చేపట్టాలని శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. అసెంబ్లీలో మా పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది' అని అని నారా లోకేశ్ వివ‌రించారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఈ రోజు కూడా టీడీపీ నేత‌లు జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై చ‌ర్చ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  

        
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News