ఎన్టీఆర్ కి అక్క పాత్రలో సీనియర్ హీరోయిన్ ను సెట్ చేసిన కొరటాల?

Koratala and Ntr Combo Update
  • బాలీవుడ్ బ్యూటీగా సొనాలి బింద్రే 
  • తెలుగులోను దక్కిన వరుస హిట్లు 
  • ఎన్టీఆర్ సినిమా కోసం సంప్రదింపులు 
  • త్వరలోనే రానున్న క్లారిటీ
త్రివిక్రమ్ తరువాత తన సినిమాల్లో ముఖ్యమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్ ను తీసుకునే దర్శకుడిగా కొరటాల కనిపిస్తారు. ఇంతవరకూ తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం ఆయన ఆమని ... నదియా .. దేవయాని .. సుకన్య .. సంగీత వంటి సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలను ఇస్తూ వచ్చారు. 

ఇక ఎన్టీఆర్ తో చేయనున్న తన తాజా చిత్రంలోనూ కొరటాల ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ కి అవకాశం ఇస్తున్నట్టుగా ఒక వార్త బలంగానే వినిపిస్తోంది. ఆ సీనియర్ హీరోయిన్ పేరే సోనాలి బింద్రే. కొంతకాలంగా కేన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన ఆమె, తిరిగి ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించడం జరిగిందని అంటున్నారు. 

బాలీవుడ్ బ్యూటీగా సొనాలికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె చేసిన 'మురారి' .. 'ఇంద్ర' .. 'ఖడ్గం' .. 'మన్మథుడు' భారీ విజయాలను అందుకున్నాయి. ఆమె ఎంపికలో వాస్తవమెంతన్నది చూడాలి. ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ అలరించనుంది. ప్రస్తుతం కొరటాల నుంచి 'ఆచార్య' .. ఎన్టీఆర్ నుంచి 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
Go Back to Shorts
Ntr
Alia Bhatt
Sonali Bendre
Koratala Movie

More Telugu News