ఆర్ఆర్ఆర్ నుంచి 'ఎత్తర జెండా' ప్రోమో రిలీజ్
- చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
- ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
- ఇటీవల ఎత్తర జెండా పాట గురించి వెల్లడించిన చిత్రబృందం
- పూర్తి పాట ఈ నెల 14న రిలీజ్
ఇటీవల 'ఎత్తర జెండా' అనే ఉత్తేజభరిత గీతం గురించి వెల్లడించిన చిత్రబృందం ఆ పాట తాలూకు ప్రోమో వీడియోను నేడు పంచుకుంది. పూర్తి పాట ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాటకు కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.