జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు విరాళాలు
Add ap7am to your home Screen

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు విరాళాలు

huge funds from nris to janasena
  • 14న జ‌న‌సేన‌ ఆవిర్భావ వేడుక‌లు
  • స‌హ‌క‌రించాలంటూ ప్ర‌వాసాంధ్రుల‌కు పిలుపు
  • రూ.1 ల‌క్ష పంపిన‌ శ్రీనివాసులు బ‌ల్నీది
  • ధ‌న్యవాదాలు చెబుతూ జ‌న‌సేన ట్వీట్‌
ఈ నెల 14న మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామ ప‌రిధిలో 'జనసేన పార్టీ' ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేసింది. అదే స‌మ‌యంలో ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌మ వంతు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌వాసాంధ్రుల‌ను కోరుతూ పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌న్ ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

నాదెండ్ల పిలుపున‌కు ప్ర‌వాసాంధ్రుల్లోని జ‌న సైనికులు బాగానే స్పందిస్తున్న‌ట్లుగా స‌మాచారం. విదేశాల్లో ఉంటున్న శ్రీనివాసులు బ‌ల్నీది అనే వ్య‌క్తి జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌న వంతుగా తాజాగా రూ.1 ల‌క్ష‌ను పంపారు. ఈ మేర‌కు శ్రీనివాసులు పంపిన మొత్తం త‌మ‌కు అందింద‌ని, పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌న వంతుగా స‌హ‌క‌రించిన శ్రీనివాసులుకు ధ‌న్య‌వాదాలు చెబుతూ జ‌న‌సేన ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
formarion day

More Telugu News