ఢిల్లీ, పంజాబ్ తర్వాత.. గుజరాత్ పై గురిపెట్టిన ఆప్
- పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆప్
- గుజరాత్ ఇప్పుడు ఆప్ ను కోరుకుంటోందని వ్యాఖ్య
- ఏప్రిల్ నుంచి గుజరాత్ లో తిరంగా యాత్ర
ట్వీట్ లో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫొటో తో పోస్టర్ కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో గుజరాత్ రాష్ట్రంలో ఆప్ తిరంగా యాత్రను మొదలు పెట్టనుంది. అన్ని మండలాలు, పంచాయతీల పరిధిలో ఇది ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు, పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్న భగవంత్ మాన్ కూడా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.