Krishna District: మచిలీపట్టణం ప్రాంతంలో దారుణం.. స్నేహితుడితో బీచ్‌కు వెళ్లిన యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం

Young girl Raped by two miscreants in Machilipatnam beach
  • పల్లిపాలెం బీచ్‌లో ఘటన
  • యువతి బీచ్‌కు రావడాన్ని గమనించి, అనుసరించిన యువకులు
  • యువతి స్నేహితుడిని  కట్టేసి ఆమెపై అత్యాచారం
  • నాగబాబు అనే నిందితుడి అరెస్ట్
స్నేహితుడితో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువకుడిని కొట్టి కట్టేసి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్టణం ప్రాంతంలోని పల్లిపాలెం బీచ్‌లో జరిగిందీ ఘటన. మచిలీపట్టణానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి కరగ్రహారం శివారులోని పల్లిపాలెం బీచ్‌కు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వీరు బీచ్‌కు రావడాన్ని గమనించి వెంబడించారు. 

అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు యువకుడిపై దాడిచేసి కట్టేశారు. ఆపై యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగబాబు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Krishna District
pallipalem Beach
Machilipatnam
Rape

More Telugu News