జనసేన పార్టీలో చేరిన ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు
- ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలం పనిచేసిన వెంకటేశ్వరరావు
- పవన్ ఆలోచనలు నచ్చాయని వెల్లడి
- జనసేన సిద్ధాంతాలు ఆకట్టుకున్నాయని వివరణ
- వెంకటేశ్వరరావును పార్టీలోకి స్వాగతించిన నాదెండ్ల
హైదరాబాదులోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వెంకటేశ్వరరావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు నాదెండ్ల మనోహర్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. వెంకటేశ్వరరావు కడప జిల్లా రాజంపేటకు చెందినవారు.