వీడని వివాదం.. మరింత చిక్కుల్లో మంచు ఫ్యామిలీ
- మరింత ముదిరిన హెయిర్ స్టైలిస్ట్‌పై చిత్రహింసల వివాదం
- తనపై నకిలీ చోరీ కేసు పెట్టారన్న నాగశీను
- వైరల్‌గా మారిపోయిన నాగశీను వీడియో
- దాని ఆధారంగా క్షమాపణ చెప్పాలన్న నాయీ బ్రాహ్మణ సంఘం
ఇటీవలి వివాదంలో మంచు ఫ్యామిలీపై ఆరోపణలు గుప్పించిన నాగశీను నాయీ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడట. తనకు మంచు ఫ్యామిలీ చేతిలో ఏ రకమైన అవమానం జరిగిందన్న విషయాన్ని వివరిస్తూ నాగశీను ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వైరల్‌గా మారగా..దానిని నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు కూడా చూశారు.
వారి పరిశీలనలో నాగశీనును కులం పేరుతో దూషించడమేనని.. ఈ లెక్కన మంచు ఫ్యామిలీ తమ కులాన్ని దూషించిందని ఆరోపించిన నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఆరోపించారు. దీంతో తక్షణమే నాయీ బ్రాహ్మణులకు మంచు ఫ్యామిలీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ వివాదంపై ఇంత రచ్చ సాగుతున్నా..ఇప్పటిదాకా మంచు ఫ్యామిలీ దీనిపై నోరు మెదపకపోవడం గమనార్హం.