Naresh: సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మోహన్ బాబు: నరేశ్

Mohan Babu is big brother to Tollywood says Naresh
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరనే చర్చ జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మోహన్ బాబు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, తమ అందరికీ అన్న, అందరి కంటే మిన్న మోహన్ బాబు అని అన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప హీరోలున్నారని, గొప్ప విలన్లు ఉన్నారని, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని... కానీ అన్నీ కలిసిన ఒకే ఒక వ్యక్తి మోహన్ బాబు అని నరేశ్ కొనియాడారు. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రైతు కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నటుడు మోహన్ బాబు అని కితాబునిచ్చారు. మోహన్ బాబు సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసం పుట్టిన వ్యక్తి అని అన్నారు.
Go Back to Shorts
Naresh
Mohan Babu
Tollywood

More Telugu News