కేరళలో 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్
- జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువకుడు
- పరీక్షల్లో మంకీ ఫీవర్‌గా గుర్తింపు
- ఈ ఏడాది ఇదే తొలి కేసు
బాధిత యువకుడికి ప్రస్తుతం మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ)నే మంకీ ఫీవర్‌గా పిలుస్తుంటారు. కేరళలో మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. కాగా, గత నెలలో కర్ణాటకలోనూ ఓ కేసు నమోదైంది.