మహేశ్ మూవీలో ముద్దుల మేనల్లుడు!

Sarkaru Vaari Paata movie update
  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • ముఖ్యమైన పాత్రలో సుధీర్ బాబు తనయుడు
  • ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు
స్టార్ హీరోల సినిమాల్లో వారి చిన్నప్పటి పాత్రలను చేయాలంటే, తమ పిల్లలనే రంగంలోకి దింపేవారు. అలాగే ఇతర చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేయవలసి వచ్చినప్పుడు కూడా తమ పిల్లలతోనే చేయించారు. ఆ మధ్య మహేశ్ బాబు హీరోగా చేసిన '1 నేనొక్కడినే' సినిమాలో మహేశ్ తో పాటు ఆయన తనయుడు గౌతమ్ కూడా చేశాడు.

అలా ఇప్పుడు మహేశ్ బాబు చేస్తున్న 'సర్కారువారి పాట' సినిమాలో ఆయన మేనల్లుడు 'చరిత్' ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. హీరో సుధీర్ బాబు తనయుడే 'చరిత్'. సినిమాలో ఈ కుర్రాడి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఈ సినిమా తరువాత అతను చైల్డ్ ఆరిస్టుగా బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో మహేశ్ మేనల్లుడు చేస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ఒక వార్త బయటికి వచ్చింది. తాజాగా ఆ విషయాన్ని సుధీర్ బాబు ధ్రువీకరించాడు. మహేశ్ తో కలిసి తన తనయుడు నటిస్తుండటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని అన్నాడు. ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkaru Vaari Paata

More Telugu News