ఎన్టీఆర్ తరువాత చరణ్ ను లైన్లో పెట్టిన కొరటాల!

Charan in Koratala movie
  • చరణ్ కి కథ వినిపించిన కొరటాల 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్ 
  • వచ్చే ఏడాది పట్టాలపైకి 
  • ఈ లోగా రెండు సినిమాలు చేయనున్న చరణ్ 
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. రాజమౌళి మాదిరిగానే, ఇంతవరకూ అపజయమనేది కొరటాలకు తెలియదు. 'మిర్చి' తరువాత కొరటాల .. చరణ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

'ఆచార్య' సినిమాలో చరణ్ తో ఒక చిన్న రోల్ చేయించాలని కొరటాల అనుకున్నారు. కానీ అది మల్టీ స్టారర్ మూవీ అనిపించే స్థాయిలో తయారైంది. అయితే చరణ్ సోలో హీరోగా ఒక లైన్ అనుకున్న కొరటాల, ఆయనకి వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇదంతా కూడా 'ఆచార్య' షూటింగు సమయంలోనే జరిగిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం కొరటాల .. ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరో వైపున శంకర్ ప్రాజెక్టును పట్టాలెక్కించిన చరణ్, ఆ తరువాత గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పాడు. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళతాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.
Go Back to Shorts
Junior NTR
Charan
Koratala Movie

More Telugu News