Jagananna Chedodu Scheme: రేపు 'జగనన్న చేదోడు' పథకం నిధుల విడుదల

Jagananna Chedodu scheme benefits will be released tomorrow
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నిధులను రేపు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఒక్క బటన్ క్లిక్ చేసి దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జగనన్న చేదోడు పథకం కింద షాపులు కలిగి ఉన్న 1.46 లక్షల మంది దర్జీలు , 98 వేల మంది రజకులు, 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూరనుంది.
Go Back to Shorts
Jagananna Chedodu Scheme
Benefits
YSRCP
Andhra Pradesh

More Telugu News