Junior NTR: ఎన్టీఆర్ .. అలియా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

Koratala movie will start from April first week
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చిరంజీవి కథానాయకుడిగా కొరటాల రూపొందించిన 'ఆచార్య' కూడా విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి సినిమాను కొరటాల - ఎన్టీఆర్ కలిసి చేయనున్నారు.

గతంలో కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. అందువలన సహజంగానే తాజా ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి అలియా భట్ ను ఎంపిక చేశారు .. ఆమె కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ లోగా ఇతర నటీనటుల ఎంపికను .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Junior NTR
Alia Bhatt
Koratala Movie

More Telugu News