ఎన్టీఆర్ .. కొరటాల మూవీలో అలియా భట్ ఖరారు!

Alia Bhat in Korata Direction
  • ఎన్టీఆర్ తో కొరటాల మూవీ
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్
  • ఈ నెల 7న పూజా కార్యక్రమాలు
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా చాలామంది కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ జాబితాలో అలియా భట్ పేరు కూడా వినిపించింది .. తాజాగా ఆమెనే ఖరారు చేశారు. ఇక ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు .. ఎందుకంటే అలియా భట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

"కొరటాల శివ గారు నన్ను కలిశారు .. ఈ సినిమాలో నా పాత్రను గురించి చెప్పారు. కథ విన్న తరువాత నేను రెండవ ఆలోచన చేయకుండా ఓకే చెప్పాను. చాలా తక్కువ సమయంలో ఎన్టీఆర్ గారితో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇక కొరటాల సార్ చేసిన 'ఆచార్య' సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను" అని ఆమె బాలీవుడ్ మీడియాతో చెప్పింది.

సుధాకర్ మిక్కిలినేనితో కలిసి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ను ఫైనల్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
Go Back to Shorts
Junior NTR
Alia Bhatt
Koratala Movie

More Telugu News