గుర్తు తెలియని యువతితో కెమెరాకు చిక్కిన హృతిక్ రోషన్.. మోతెక్కుతున్న సోషల్ మీడియా.. ఫొటోలు ఇవిగో!

Hrithik Roshan Photograped wiht mystery woman
  • ముంబైలోని రెస్టారెంట్ నుంచి యువతితో వచ్చిన హృతిక్
  • కారులోకి ఎక్కేంత వరకు చేతిని వదలని హృతిక్
  • ఆమె సామా అజాద్ అని అంటున్న నెటిజెన్లు
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఒక గుర్తు తెలియని యువతితో వస్తూ కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి చేతిలో చేయి వేసుకుని బయటకు వస్తుండగా పాపరాజీలు ఫొటోను క్లిక్ మనిపించారు. వైట్ అండ్ వైట్ లో ఉన్న హృతిక్ బ్లూ జాకెట్ ధరించి ఉన్నాడు. మిస్టరీ యువతి లూజ్ ప్యాంట్, బ్లాక్ టాప్ లో స్టైలిష్ గా ఉంది. ఆమె మాస్క్ ధరించి ఉండటంతో ముఖం కనిపించడం లేదు.

రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కారులోకి ఎక్కేంత వరకు ఆమె చేతిని హృతిక్ వదల్లేదు. చేతిలో చేయి వేసుకునే ఇద్దరూ కారులోకి ఎక్కారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి కలయికపై రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

మరోవైపు కొందరు ఆమె ఎవరో కూడా చెప్పేస్తున్నారు. ఆ మిస్టీరియస్ యువతి మ్యుజీషియన్, యాక్ట్రెస్ సామా అజాద్ అని అంటున్నారు. సుస్సానే ఖాన్, హృతిక్ రోషన్ ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు.
Go Back to Shorts
Hrithik Roshan
Sama Azad
Tollywood

More Telugu News