జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చేగొండి సూర్యప్రకాశ్ కు చోటు
- కీలక నియామకాలకు పవన్ పచ్చజెండా
- పీఏసీ సభ్యుడిగా చేగొండి సూర్యప్రకాశ్ నియామకం
- 2018లో జనసేనలో చేరిన సూర్యప్రకాశ్
- సూర్యప్రకాశ్ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు
ఇక, పవన్ కల్యాణ్ కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులను కూడా నియమించారు. కాకినాడకు సంగిశెట్టి అశోక్, రాజమండ్రికి యర్నాగుల శ్రీనివాసరావు, తిరుపతికి జగదీశ్ రాజారెడ్డి, ఒంగోలుకు మలగా రమేశ్ లను పార్టీ అధ్యక్షులుగా నియమించారు.