రేపు రానా చేతుల మీదుగా '11:11' మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్!

25-01-2022 Tue 12:28 | Entertainment
  • విభిన్నమైన కథతో '11:11' సినిమా
  • హీరోగా రాజీవ్ సాలూరు
  • సంగీత దర్శకుడు కోటి తనయుడే రాజీవ్
  • హీరోయిన్ గా వర్ష విశ్వనాథ్ పరిచయం
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. '11:11' అనే టైటిల్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్ గా ఈ టైమ్ ను సెట్ చేసుకోవడం వెనుక కారణం ఏమిటనేది సినిమా చూస్తేనేగాని తెలియదట. కథకు .. ఈ సమయానికి మధ్య గల సంబంధం ఏమిటనేది సస్పెన్స్ అని అంటున్నారు.

వీరేశ్ నిర్మించిన ఈ సినిమాకి కిట్టు నల్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి రేపు మోషన్ పోస్టర్ ను వదలనున్నారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయిస్తున్నట్టుగా అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం 9:30 నిమిషాలకు రానా ఆన్ లైన్లో ఈ మోషన్ పోస్టర్ ను వదలనున్నాడు.

కోటి తనయుడి సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో రాజీవ్ జోడీగా వర్ష విశ్వనాథ్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాతో రాజీవ్ సాలూరు హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి..
Salur RajeevVarshaKittu Nalluri11:11 Movie

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more