Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్'లో ఆ రెండు ఫైట్ల కోసం అంత ఖర్చు చేశారట!

  • 'ఆర్ ఆర్ ఆర్'పైనే అందరి దృష్టి 
  • ఇంటర్వెల్ .. క్లైమాక్స్ ఫైట్స్ హైలైట్ 
  • ఈ ఫైట్స్ కోసమే 30 శాతం బడ్జెట్ ఖర్చు 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు   
RRR movie update

రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా తీవ్రత కారణంగా వాయిదా వేశారు. వేసవిలో ఈ సినిమా రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 18వ తేదీన గానీ, ఏప్రిల్ 28వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్ యాక్షన్ సీన్ పైనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందట. ఇక్కడి నుంచే కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ తరువాత కూడా యాక్షన్ సీక్వెల్స్ ఎక్కువగా సాగుతాయని అంటున్నారు.

ఇక క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ యాక్షన్ ను చూడటానికి రెండు కళ్లు చాలవట. ఇంటర్వెల్ .. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్స్ కోసం, ఈ సినిమా బడ్జెట్ లో 30 శాతాన్ని ఖర్చు చేశారని అంటున్నారు. దీనిని బట్టి ఈ రెండు ఫైట్స్ ను ఏ రేంజ్ లో చిత్రీకరించి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు.

More Telugu News