కొరటాలతో ఎన్టీఆర్ సినిమాకి రంగం సిద్ధం!
- కొరటాలతో 'జనతా గ్యారేజ్' చేసిన ఎన్టీఆర్
- ఆ సినిమాతో సొంతమైన భారీ హిట్
- మరో ప్రాజెక్టుతో త్వరలో సెట్స్ పైకి
- కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి 30వ సినిమా
అందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన తొందరపడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక వచ్చేనెల ఫస్టువీక్ లో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.
ఇక ఈ సినిమాలో కథానాయికలుగా జాన్వీ కపూర్ .. అలియా భట్ .. కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపించాయి. మరి వీరిలో ఎవరిని తీసుకుంటారనేది ఈ సినిమాను లాంచ్ చేసే రోజున తెలియవచ్చు. 'జనతా గ్యారేజ్' తరువాత కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అందరిలోను ఆసక్తి ఉంది.