ఉద్యోగులు సమ్మె ప్రకటించిన విషయం మాకు తెలియదు: మంత్రి పేర్ని నాని
- ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ
- వివరాలు మీడియాకు తెలిపిన మంత్రి పేర్ని నాని
- ఉద్యోగుల సమ్మె విషయం ప్రస్తావించిన మీడియా
- కమిటీ ఏర్పాటు కూడా తనకు తెలియదన్న పేర్ని నాని
ఉద్యోగులు సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని తిడితే హెచ్ఆర్ఏ పెరుగుతుందా? అని ప్రశ్నించారు. న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని అన్నారు. ఉద్యోగులు రోడ్లెక్కరాదనే ప్రభుత్వం కోరుకుంటోందని వెల్లడించారు.
ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాలను పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు.