ఈ తమిళ పదబంధాన్ని నా జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాను: ఆనంద్ మహీంద్రా
- తమిళనాడులోనే చదువుకున్నానని చెప్పిన ఆనంద్
- పోడా డేయ్ అనే మాట నేర్చుకున్నానని వివరణ
- చాలా సందర్భాల్లో ఆ పదం అక్కరకొచ్చిందన్న ఆనంద్
"నువ్వు చెప్పే చెత్త వివరణ, నీ సోదిని భరించే ఓపిక నాకు లేదు, నన్ను వదిలేస్తే సంతోషిస్తా" అని ఇంగ్లీషులో చెప్పడం కంటే... తమిళంలో "పోడా డేయ్" (పోరా రేయ్) అని ఒక్కముక్కలో చెప్పడమే తనకిష్టమని వెల్లడించారు. తాను పాఠశాల విద్యను తమిళనాడులోనే అభ్యసించానని, తాను మొదట నేర్చుకున్నది 'పోడా డేయ్' అనే ఈ మాటనే అని తెలిపారు.
చాలా ఎక్కువసార్లు ఆ పదబంధం ఉపయోగించేవాడ్నని, తన జీవితంలో చాలా సందర్భాల్లో 'పోడా డేయ్' అనాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు గట్టిగా అరిచి చెప్పేవాడ్నని తెలిపారు. అది అంతలా తనతో మమేకమైపోయిందని వివరించారు.