ఎన్టీఆర్ కి బాబాయ్ పాత్రలో రాజశేఖర్?
- కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
- కథానాయికగా కియారా అద్వాని
- రాజశేఖర్ తో సంప్రదింపులు
ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి ఆయన కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కి బాబాయ్ గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ఆయన అయితే కరెక్టుగా నప్పుతారనే ఉద్దేశంతో కొరటాల ఆయనను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. దాదాపు రాజశేఖర్ ఒప్పుకోవచ్చునని అంటున్నారు.
'ఆచార్య' సినిమాను విడుదలకు రెడీ చేసిన కొరటాల, ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కియారా అద్వాని కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో రాజశేఖర్ నటిస్తే కనుక క్రేజీ ప్రాజక్టు అవుతుందనే చెప్పచ్చు.