తెలంగాణలో కొత్తగా 1,673 కరోనా కేసుల నమోదు
- గత 24 గంటల్లో 48,583 కరోనా పరీక్షలు
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 13,522 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,466 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,522 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,042కి పెరిగింది.
