వర్షం పడుతుందనే విషయాన్ని వాతావరణశాఖ అంచనా వేయలేకపోయింది: తమిళనాడు సీఎం స్టాలిన్
- మొన్న చెన్నైలో భారీ వర్షం
- పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం
- వాతావరణశాఖను అప్ గ్రేడ్ చేస్తామన్న స్టాలిన్
నీట మునిగిన ప్రాంతాలను స్టాలిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలను వాతావరణశాఖ అంచనా వేయలేకపోయిందని చెప్పారు. వాతావరణశాఖ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వంతో కలిసి అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. వర్షం వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు.