Vangaveeti Radha: నా హత్యకు స్కెచ్ వేశారు... వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుంది: వంగవీటి రాధా
వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రాధా సంచలన విషయం వెల్లడించారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఇటీవల రెక్కీ కూడా జరిగిందని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాబట్టి ఆ విషయం ఇప్పుడు చెప్పలేనని, వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులను అందరూ దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
అయితే తాను ప్రజల మధ్యన ఉండే మనిషినని, దేనికీ భయపడే వ్యక్తిని కానని రాధా ఉద్ఘాటించారు. కాగా, రాధా తండ్రి రంగా వర్ధంతి సభకు ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. వీరు ముగ్గురు గుడివాడ సమీపంలోని కొండలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు.