TTD: తిరుమ‌ల శ్రీ‌వారిని దర్శించుకున్న 'పుష్ప' టీమ్

pushpa team visits ttd
షార్ట్స్‌లో చూడండి
 'పుష్ప' సినిమా బృందం తిరుమల శ్రీ‌వారిని సందర్శించింది. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆ సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్, త‌దిత‌రులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంత‌రం వారు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. 'పుష్ప' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీ‌వారి స‌న్నిధికి వ‌చ్చామ‌ని ఆ సినిమా యూనిట్ చెప్పింది.

ఈ సినిమా పార్ట్-2 నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించ‌నున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా 'పుష్ప'ను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన విష‌యం తెలిసిందే. గ‌త రాత్రి తిరుపతిలో ఈ సినిమా సక్సెస్‌ పార్టీని నిర్వహించారు.  

       


Go Back to Shorts
TTD
Pushpa
sukumar

More Telugu News