Italy: సంగీత కళాకారుడి వద్ద లక్షలాది చిన్నారుల నగ్న చిత్రాలు, వీడియోలు.. అరెస్ట్

Italian musician arrested with over a million child porn visuals
  • ఇటలీలోని అంకోనాలో ఘటన
  • చిన్నారులతో పెద్దలు శృంగారంలో పాల్గొన్నట్టుగా ఫొటోలు
  • దుర్వినియోగం చేయలేదని పోలీసుల నిర్ధారణ
  • 20 ఏళ్లుగా ఫొటోలు, వీడియోలు సేకరణ
ఇటలీలోని తీరప్రాంతమైన అంకోనాలో 49 ఏళ్ల సంగీతకారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న లక్షలాది నగ్నఫొటోలు, వీడియోలు చూసి నోరెళ్లబెట్టారు. అంతేకాదు, చిన్నారులతో పెద్దలు శృంగారంలో పాల్గొన్నట్టుగా చిత్రీకరించిన మిలియన్‌కు పైగా ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.  

20 ఏళ్లుగా అతడు వీటిని సేకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, వీటిని అతడు దుర్వినియోగం చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ఫొటోలు, వీడియోలను బాధితుల వయసు వారీగా విభజించి ప్రత్యేక ఫోల్డర్లలో భద్రపరిచాడు.  చిన్నారులకు అతడు సంగీత పాఠాలు చెప్పేవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Italy
Musician
Arrest
Crime News

More Telugu News