దుబాయ్ లో ఓ పోలీస్ స్టేషన్ ను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన రామ్ గోపాల్ వర్మ
- 'లడ్కీ' చిత్ర ప్రమోషన్ కోసం దుబాయ్ వెళ్లిన వర్మ
- బుర్జ్ ఖలీఫా టవర్స్ లో చిత్ర ప్రమోషన్ ఈవెంట్
- దుబాయ్ లో స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన వైనం
- వర్మ వీడియోను పంచుకున్న దుబాయ్ పోలీసులు
ఈ వీడియోలో వర్మ మాట్లాడుతూ, దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను చూస్తుంటే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుగా ఉందని, ప్రతి అంశం అద్భుతంగా ఉందని వివరించారు. భారత్ లో పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో, అందుకు పూర్తి విరుద్ధంగా దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఉందని, ఈ విషయాన్ని తాను కళ్లారా చూశానని తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్ ను చూసిన తర్వాత "బ్యూటిఫుల్" అనే మాట ఉపయోగించక తప్పడంలేదని అన్నారు. ఇంత స్మార్ట్ గా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న పోలీస్ స్టేషన్ ను ఇతర దేశాలు కాపీ కొట్టడం ఖాయమని పేర్కొన్నారు.