Chandrababu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌

chandra babu writes letter to dgp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ గౌతం స‌వాంగ్‌కు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో జాతర వేళ‌ టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ హత్యాయత్నానికి పాల్పడింద‌ని టీడీపీ ఆరోపిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపైనే గౌతం స‌వాంగ్‌కు చంద్ర‌బాబు నాయుడు ఫిర్యాదు చేశారు. తిక్కారెడ్డిపై దాడి ఘ‌ట‌న‌లో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

క‌ర్నూలు జిల్లాలోని కోసిగి మండ‌లం బొంప‌ల్లెలో తిక్కారెడ్డిపై దాడి జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. ఆల‌యానికి వెళ్లిన ఆయ‌న‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌లే దాడి చేశార‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ దాడిలో ఐదుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లకు గాయాల‌య్యాయ‌ని ఆయ‌న చెప్పారు. వైసీపీ దాడుల‌కు అడ్డుకోవ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో బాధ్యుత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుని తిక్కారెడ్డికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
AP DGP

More Telugu News