Tollywood: నా తొలి సీన్​ తారక్​ తోనే.. నన్ను చూసి ఆయన​ టెన్షన్​ పడ్డారు: అలియా భట్​

My First Scene In RRR with NTR Says Alia
షార్ట్స్‌లో చూడండి
చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు రాజమౌళి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, మంచి కథ వస్తే బాలీవుడ్ హీరోహీరోయిన్లూ టాలీవుడ్ లో నటించేందుకు సిద్ధమేనని అలియా భట్ తెలిపారు. తారక్, చరణ్ లు మంచి నటులని, వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.

ఇక 'ఆర్ఆర్ఆర్'లో తన తొలి షూట్ తారక్ తోనే జరిగిందన్నారు. అయితే, తారక్ తనను చూసిన వెంటనే ‘‘కాస్త టెన్షన్ గా ఉంది.. ఇన్నాళ్లూ చరణ్ తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్ లేదు’’ అన్నారు నవ్వుతూ. తారక్, చరణ్ ఒక చోట చేరితే మాత్రం అల్లరేఅల్లరన్నారు. చరణ్ ను తారక్ ఆటపట్టిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ఓకే చేసిన తర్వాత ఏడాది పాటు అక్షయ్ అనే ట్రైనర్ తో జూమ్ లోనే తెలుగు నేర్చుకున్నానని అలియా తెలిపారు.

ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఓ ఊపు ఊపేస్తోందని ఆమె అన్నారు. ట్రైలర్ అదిరిపోయిందంటూ కామెంట్ చేశారు. రాజమౌళి సినిమాలో నటించాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందన్నారు. కరోనా క్లిష్ట సమయాల్లోనూ టీమ్ మొత్తం ఎంతో కష్టపడి వర్క్ చేసిందని, దాని నుంచి తానూ స్ఫూర్తి పొందానని చెప్పారు.
Go Back to Shorts
Tollywood
Bollywood
Alia Bhatt
RRR
Junior NTR
Ramcharan

More Telugu News