Junior NTR: 'నాటు నాటు' పాటకి నాన్ స్టాప్ లైక్స్!

  • రాజమౌళి నుంచి 'ఆర్ ఆర్ ఆర్'
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • దూసుకుపోతున్న నాటు సాంగ్
  • జనవరి 7వ తేదీన విడుదల  
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో నడుస్తుంది. డీవీవీ దానయ్య నిర్మించిన సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన పాటలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలే ఈ సినిమా నుంచి 'నాటు నాటు' అనే పాటను వదిలారు. ఎన్టీఆర్ - చరణ్ పై చిత్రీకరించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగినట్టుగానే నాటు స్టెప్స్ పడ్డాయి. జోరుగా .. హుషారుగా సాగే ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

వివిధ భాషల్లో విడుదలైన ఈ పాట ఇటీవల 80 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అలాగే 3 వారాలలో ఈ పాట మిలియన్ లైక్స్ ను సంపాదించుకుంది. తెలుగు సినిమాలకి సంబంధించి యూ ట్యూబ్ లో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి లైక్స్ ను సంపాదించుకున్న పాట ఇదేనని అంటున్నారు. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News