మేం మనిషి ప్రాణానికి విలువిస్తాం: సీఎం జగన్

25-11-2021 Thu 17:07 | Andhra
  • ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం
  • వైద్యం, ఆరోగ్యం అంశాల్లో ప్రభుత్వ విధానాలపై వివరణ
  • వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చామని వెల్లడి
  • పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు పొందవచ్చన్న సీఎం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు సీఎం జగన్ ఆరోగ్యం, వైద్యం సంబంధింత అంశాలపై ప్రసంగించారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. తమది మనిషి ప్రాణాలకు విలువనిచ్చే ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ అనే పథకం తమను కాపాడుతుంది అని పేదల్లో భరోసా కలిగించేలా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆరోగ్య శ్రీ కిందికి వచ్చే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను కూడా ఎక్కడా కోతలు పెట్టకుండా మానవీయ కోణంలో పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్, బై కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్, హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య ప్రక్రియలకు కూడా సాయం అందిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్య శ్రీ ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని, రాష్ట్రంలో 90 శాతం మందికి దీన్ని వర్తింపజేస్తున్నామని వెల్లడించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2,446 చికిత్సలను తీసుకువచ్చామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లోనూ సేవలు పొందే సౌలభ్యం కల్పించామని అన్నారు.

రాష్ట్రంలో గతంలో ఆసుపత్రులు ఎలా ఉన్నాయి... ఇప్పుడు ఆసుపత్రులు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని గమనించాలని సీఎం జగన్ సూచించారు. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నామని పేర్కొన్నారు. రూ.16,255 కోట్ల వ్యయంతో ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు చేపట్టామని, ఆరోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. 2022 ఫిబ్రవరి లోగా మరో 14,788 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.

ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, దాంతో పార్లమెంటు స్థానం పరిధిలో ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు వీలు కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఓ బోధనాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
CM JaganArogya SriNadu-NeduAP Assembly SessionYSRCP

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more