'మెసస్కేల్ ఫినామినా'.... చెన్నైలో అతి భారీ వర్షానికి కారణం ఇదే!
- ఈ నెల 6న చెన్నైలో కుండపోత వాన
- నీట మునిగిన నగరం
- వివరణ ఇచ్చిన వాతావరణ కేంద్రం చీఫ్
- 'మెసస్కేల్ ఫినామినా'ను ముందుగా పసిగట్టలేమని వెల్లడి
దీనిపై వాతావరణ శాఖ దక్షిణాది విభాగం చీఫ్ బాలచంద్రన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను 'మెసస్కేల్ ఫినామినా' అంటారని వెల్లడించారు. దీన్ని ముందుగా పసిగట్టలేమని తెలిపారు. చెన్నైలోని నుంగంబాక్కం, మీనంబాక్కం మధ్య కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమేనని, కానీ నుంగంబాక్కంలో 20 సెంటిమీటర్లు, మీనంబాక్కంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం 'మెసస్కేల్ ఫినామినా' కిందికి వస్తుందని పేర్కొన్నారు.
రోజువారీ పరిశోధనలో భాగంగా ఈ నెల 6కి సంబంధించి గాలి దిశ, మేఘాల కదలికలను పరిశీలిస్తున్నప్పుడు తమ అంచనాల్లో చెన్నై నగరంలేదని, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు మాత్రం భారీ వర్షసూచన ఇచ్చామని బాలచంద్రన్ చెప్పారు. కానీ చెన్నై నగరంలో ఊహించని విధంగా కొద్ది సమయంలోనే అతి భారీ వర్షం కురిసిందని వెల్లడించారు.