నేడు రాజధాని రైతుల మహాపాదయాత్రకు విరామం
- కొనసాగుతున్న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' మహాపాదయాత్ర
- ఇప్పటి వరకు పూర్తయిన 96.3 కిలోమీటర్ల పాదయాత్ర
- కార్తిక సోమవారం, నాగుల చవితి సందర్భంగా ఈనాటి యాత్రకు విరామం
కార్తీక సోమవారం సందర్భంగా ఇంకొల్లులో పాదయాత్ర క్యాంపు వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ప్రత్యేక రథం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ మనసు మారి ఇప్పటికైనా ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ఆయనకు బుద్ధినివ్వాలని దేవుడిని ప్రార్థించామని చెప్పారు.