కబడ్డీ.. కబడ్డీ అంటూ హుషారుగా యువకులతో పోటీల్లో పాల్గొన్న రోజా.. ఔట్ చేయలేకపోయిన భర్త సెల్వమణి.. వీడియో వైరల్
వైసీపీ ఎమ్మెల్యే రోజా తన భర్త, పలువురు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఆమెను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించగా ఆయన ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి. ఆటవిడుపుతో రోజా అలరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఏపీలో నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అతిథిగా అక్కడకు రోజా వెళ్లారు. టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక వేశారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త సెల్వమణి కూడా పాల్గొన్నారు. ఒక్కో జట్టు తరఫున భార్యాభర్తలు ఆడారు. రోజా కబడ్డీ ఆటలో కూతకు వచ్చిన సమయంలో ఆమెను ఔట్ చేయడానికి సెల్వమణి ప్రయత్నించారు. అనంతరం ఆయన కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు.