బాలయ్య సినిమాలో మరోసారి హనీరోజ్!

Honey Rose to Star Again in Balakrishna Movie
  • గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సినిమా
  • హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో కీలక పాత్రలో హనీరోజ్!
  • గతంలో వీరసింహారెడ్డి సినిమాలో అలరించిన బాలకృష్ణ, హానీరోజ్
నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో మలయాళ నటి హనీరోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ళ క్రితం బాలకృష్ణ, హనీరోజ్ కాంబినేషన్‌లో 'వీరసింహారెడ్డి' వచ్చింది. 

తాజాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, హానీరోజ్ కూడా నటిస్తుందన్న వార్తలతో అంచనాలు రెట్టింపయ్యాయి.

బాలకృష్ణ, గోపిచంద్ కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, హనీరోజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి'ని ప్రేక్షకులు ఆదరించారు. ఇదే హిట్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటం నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

సంక్రాంతి విజయాలకు బాలకృష్ణ పెట్టింది పేరు. 2023లో వచ్చిన వీరసింహారెడ్డిలో బాలకృష్ణ, హనీరోజ్ కెమిస్ట్రీ నందమూరి అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ భార్యగా 'మీనాక్షి' పాత్రలో హానీరోజు ఒదిగిపోయింది. ముఖ్యంగా 'సుగుణ సుందరి' పాటలో వీరి డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టింది. ఈ చిత్రం తర్వాత హనీరోజ్ తెలుగులో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు బాలకృష్ణ సరసన మరోసారి కనిపించనుంది.
Go Back to Shorts
Honey Rose
Nandamuri Balakrishna
Balakrishna
Gopichand Malineni
Veera Simha Reddy
Telugu Cinema

More Telugu News