ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది!

Samantha Ma Inti Bangaram Release Date Changed Due to IPL
  • వాయిదా పడ్డ సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం
  • జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • ఐపీఎల్ సీజన్ కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • గన్‌తో ఉన్న సమంత కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం నేడు ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 15న కాకుండా, కొత్తగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు గన్‌తో ఉన్న సమంత రగ్డ్ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మద్దతుదారులు టోర్నమెంట్‌ను పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం కల్పించేందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్టు వివరించింది. డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు ఐపీఎల్ వేడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్టు పేర్కొంది.

'ఓ బేబీ' తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Samantha Ruth Prabhu
Ma Inti Bangaram
Samantha movie
Nandini Reddy
IPL 2026
Telugu movie release date
Trilala Moving Pictures
Sunrisers Hyderabad
Santhosh Narayanan

More Telugu News