నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్

Vijay Reacts to NEET Paper Leak and Exam Cancellation
  • నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్
  • ఇది వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని వ్యాఖ్య
  • 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని సూచన
వైద్య విద్య జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ) 2026 పరీక్ష రద్దుపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్పందించారు. నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష రద్దు వంటివి వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తమిళనాడు మొదటి నుంచి నీట్‌ను వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. ఈ పరీక్షతో గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని విజయ్  కోరారు.

ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. జైపూర్‌లో ముగ్గురిని, గురుగ్రామ్‌లో ఒకరిని, నాసిక్‌లో ఒకరిని.. ఇలా ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. బుధవారం ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.
Go Back to Shorts
Vijay
Tamil Nadu
NEET UG
NEET exam cancelled
NEET paper leak
Medical entrance exam
CBI investigation

More Telugu News