'శ్యామ్ సింగ రాయ్' పక్కకి తప్పుకుంటాడా?
- వైవిధ్యభరిత కథాచిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
- నాని సరసన ముగ్గురు కథానాయికలు
- ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 24
- వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం
అలాంటి ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్ 17వ తేదీన 'పుష్ప' రానుండటంతో, ఆ సినిమా జోరు 'శ్యామ్ సింగ రాయ్' వసూళ్లపై పడే అవకాశం ఉందని అనుకున్నారు. అయినా 'శ్యామ్ సింగ రాయ్' వెనక్కి తగ్గే ఆలోచన చేయలేదు గానీ, ఇప్పుడు మాత్రం ఆలోచనలో పడ్డాడని అనుకుంటున్నారు.
అందుకు కారణం డిసెంబర్ 24వ తేదీన 'అఖండ' సినిమాను విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో 'శ్యామ్ సింగ రాయ్' విడుదల వాయిదా పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.