రజనీకాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి
- నిన్న అస్వస్థతకు గురైన రజనీకాంత్
- తల తిరుగుతుండడంతో అసౌకర్యానికి గురైన వైనం
- చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిక
- నేడు రజనీకి విజయవంతంగా రీవాస్కులరైజేషన్
రజనీకాంత్ ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ బులెటిన్ లో వెల్లడించారు.