కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించిన అమరీందర్ సింగ్.. రేపు అమిత్ షాతో కీలక భేటీ!

27-10-2021 Wed 12:59 | National
  • పార్టీ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదన్న అమరీందర్
  • సిద్ధూ వల్ల కాంగ్రెస్ ప్రాభవం తగ్గిందని వ్యాఖ్య
  • వ్యవసాయ చట్టాలపై అమిత్ షాతో చర్చిస్తామన్న అమరీందర్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్... తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో తమ లాయర్లు చర్చలు జరుపుతున్నారని... అందువల్ల పార్టీ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదని చెప్పారు.

పార్టీ గుర్తును ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను ఎంతో కాలం పని చేశానని... ఇంకో పది రోజులు ఆ పార్టీలో ఉండటం వల్ల ఎలాంటి నష్టం లేదని అన్నారు. మరోవైపు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ కానున్నారు.

పంజాబ్ లో ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్ర హోంమంత్రి చెపుతున్నారని... ఆయనొక అసమర్థ హోంమంత్రి అని అమరీందర్ విమర్శించారు. తమ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని ప్రారంభించిన తర్వాత మొత్తం 117 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఈ సీట్లన్నింటిలో ఒంటరిగా పోటీ చేస్తామా? లేక పొత్తులో భాగంగా పంచుకుంటామా? అనే వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో సిద్ధూ చేరినప్పటి నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చిందని అన్నారు. సిద్ధూకి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఏదో పిచ్చి వాగుడు వాగుతుంటారని విమర్శించారు. సుపరిపాలన గురించి సిద్ధూకి తెలియదని చెప్పారు.

రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులందరినీ కలిసి చర్చిస్తానని అన్నారు. కేంద్రంతో అనుకూలంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడవలేవని చెప్పారు. 25 లేదా 30 మంది నేతలతో కలిసి రేపు అమిత్ షాను కలుస్తామని... కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఏకాభిప్రాయం కలిగిన ఒక కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Amarinder SinghCongressNew PartyAmit ShahBJP

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more