ముహూర్తం ఖరారు చేసుకున్న 'భోళాశంకర్'

Bhila Shankar movie update
  • వచ్చేనెల 11వ తేదీన పూజా కార్యక్రమాలు
  • 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు
  • చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. ఇది 'లూసిఫర్' అనే మలయాళ సినిమాకి రీమేక్. ఈ సినిమా తరువాత ఆయన మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' .. బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలను లైన్లో పెట్టారు. అయితే ముందుగా 'వాల్తేర్ వీర్రాజు'ను పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.

ఈ నేపథ్యంలో 'భోళా శంకర్' మేకర్స్ తమ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళుతుందనే విషయాన్ని తాజాగా స్పష్టం చేశారు. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 7:45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టు చెప్పారు. అదే నెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు స్పష్టం చేశారు.

రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా, తమిళంలో ఆ మధ్య వచ్చిన అజిత్ 'వేదాళం' సినిమాకి రీమేక్. ఇది అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే మాస్ యాక్షన్ మూవీ. తమిళంలో లక్ష్మీ మీనన్ చేసిన పాత్రను తెలుగులో కీర్తి సురేశ్ చేయనుంది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక మెహర్ రమేశ్ నుంచి గతంలో 'కంత్రి' .. 'శక్తి' .. 'షాడో' సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chiranjeevi
Keerthi Suresh
Mehar Ramesh

More Telugu News