కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్
- మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పని చేసిన రాజేందర్
- రాజీనామా లేఖను సోనియా, రేవంత్ లకు పంపిన రాజేందర్
- చర్చనీయాంశంగా మారిన ఆకుల రాజీనామా
గత కొంత కాలంగా ఆకుల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజీగా ఉన్న తరుణంలో... ఆకుల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆకుల ఎమ్మెల్యేగా గెలుపొందారు.