కోర్టు తీవ్రమైన అభిశంసన చేసినా డీజీపీ స్పందించడంలేదు: సోమిరెడ్డి
- పోలీసు వ్యవస్థపై కోర్టు అభిశంసన చేసిందన్న సోమిరెడ్డి
- పోలీసు శాఖకు మాయని మచ్చ అని వెల్లడి
- పోలీసు వ్యవస్థపై కోర్టు నమ్మకం కోల్పోయిందని వివరణ
- డీజీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు
కోర్టు తీవ్ర అభిశంసన చేసినా కూడా డీజీపీ స్పందించకపోవడం సరికాదని, పోలీసు విభాగం ప్రతిష్ఠకు ఇది మాయనిమచ్చ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన పోలీసులు, రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిపై దూషణల విషయంలో ఇంత ఉత్సాహం ఎందుకు చూపించలేదని హైకోర్టు ప్రశ్నించడం తెలిసిందే.